మరీ ఇన్ని పిహెచ్డీలా?


రాష్ట్రంలో ఒక్కో యూనివర్సిటీ ప్రతి ఏటా వందల సంఖ్యలో పిహెచ్డీలను ప్రధానం చేయటంపై గవర్నర్ నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేసారు. రాష్ట్రంలో అన్ని పరిశోధనలు జరుగుతున్నాయా? అసలు యూనివర్సిటీలలో ఏం జరుగుతోంది? ఒక్కో యూనివర్సిటీలో ప్రవేశాలకు ఒక్కో విధానాన్ని అనుసరించడంతో పిహెచ్డీ ప్రవేశాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. లేఖ రాయటం చేతకానివారు వారు కూడా గూగుల్ నుండి కాపీ పేస్ట్ చేసి పిహెచ్డీలు పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆషామాషీ పిహెచ్డీలను తక్షణమే ఆపివేయాలని ఆయన కోరారు. అందుకే తాను స్నాతకోత్సవాలు వెళ్ళటం మానుకున్నానని గవర్నర్ తెలిపారు. 

యూజీసీ నిబంధనలు పాటిస్తూ, జాతీయ స్థాయి పరీక్షలైన నెట్‌, సెట్‌ లాంటి పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అన్ని యూనివర్సిటీలలో పిహెచ్డీ ప్రవేశాలను జరపాలని ఆయన సూచించారు. ఇక డిజిటలైజేషన్ ను సత్వరమే పూర్తి చేయాలని, బయో మెట్రిక్ హాజరును తప్పనిసరి చేయాలని కూడా అన్నారు. గుర్తింపు పొందని కళాశాలలు, ఢిల్లీ తర్వాత హైదరాబాద్ లోనే అత్యధికంగా ఉండటంపై కూడా ఆయన వివరణ కోరారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post