కాల్చి చంపింది మీరే, పరామర్శించేదీ మీరేనా?

కాల్చి చంపింది మీరే, పరామర్శించేదీ మీరేనా?
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించే  కార్యక్రమం ఉండటంపై రాష్ట్ర మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అమరవీరుల స్థూపాన్ని ఎందుకు నిర్మించారు?, ఇందిరాగాంధీ ప్రభుత్వం 369 మంది విద్యార్థులను  కాల్చి చంపినందుకే కదా! మళ్లీ ఇవాళ వచ్చి నివాళులర్పిస్తారట. ఆనాడు కాల్చి చంపింది మీరే, ఇవాళ పరామర్శించేదీ మీరేనా? అని విమర్శించారు. 

2009 డిసెంబరులో తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసుకున్నందుకే కదా, తెలంగాణలో ఆత్మహత్యలు జరిగాయి. మలివిడత ఉద్యమంలో ఆత్మహత్యలకు కారణమెవరు?, ఉస్మానియాలో పోలీసులను మోహరించి విద్యార్థులను చిత్రహింసలు పెట్టిందెవరు? అని హరీష్ ప్రశ్నించారు. రాహుల్ పర్యటనకు ఉస్మానియా వీసీ నిరాకరిస్తే మాకేమిటి సంబంధం? అని హరీష్ ప్రశ్నించారు.

నలభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క సమస్యకైనా పరిష్కారం చూపారా? పదేళ్లు రాష్ట్రంలో మరియు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కనీసం అనుమతులు తెచ్చుకోలేకపోయారు. ఇక శ్రీరామ్ సాగర్ 1963లో మొదలు పెట్టి 2014 వరకు పూర్తి చేయలేకపోయారు. నీటి సమస్యపై అసెంబ్లీలో ఖాళీ బిందెల ప్రదర్శన నిర్వహించేవారు.  కరెంటు లేక ఎండిపోయిన పంటలను తెచ్చేవారు. మేము అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే కరెంటు, నీటి సమస్యలను పరిష్కరించాము అని హరీష్ అన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post