గోదాదేవి జయంతి | ఆండాళ్ జయంతి

గోదాదేవి జయంతి | ఆండాళ్ జయంతి
గోదాదేవి జయంతిని తమిళనాట ఆది పూరం అనే పేరుతో పెద్ద పండుగలా జరుపుకుంటారు. పూరం అనేది పూర్వా ఫల్గుణి నక్షత్రాన్ని సూచిస్తుంది. ఆది అనే పేరు గల తమిళ మాసములో పూర్వా ఫల్గుణి నక్షత్రం వచ్చిన రోజున గోదాదేవి జయంతిని జరుపుకుంటారు కాబట్టి ఈ పండుగను ఆది పూరం అనే పేరుతో వ్యవరిస్తారు. 

గోదాదేవిని లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు. ఆది పూరం పండుగని వైష్ణవ మరియు శక్తి ఆలయాలలో ఉత్సవంగా జరుపుతారు.

గోదాదేవి తన అద్వితీయమైన భక్తితో శ్రీరంగనాథున్ని భర్తగా పొందిన కథ ప్రాచుర్యంలో ఉంది. ఆమె పన్నెండు మంది ఆళ్వారుల్లో ఉన్న ఏకైక స్త్రీగా ప్రసిద్ధి పొందినది. గోదాదేవి రచించిన తిరుప్పావై (30 పాశురములు), నాచ్చియారు తిరుమొళి (143 పాశురములు) జగద్విఖ్యాతి నొందాయి. తిరుప్పావై పాశురములను తెలుగునాట ధనుర్మాసములో మేలుకొలుపులుగా పాడుకోవటం చూస్తూనే ఉన్నాము. 

0/Post a Comment/Comments

Previous Post Next Post