బీచ్ ఫెస్టివల్ కు అంత ఖర్చా?

బీచ్ ఫెస్టివల్ కు అంత ఖర్చా?
జూన్ నెల 9 - 11 వ తేదీల మధ్య  జరిగిన మసుల బీచ్ ఫెస్టివల్  నిర్వహణ ఖర్చు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ వేడుక కోసం మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA), పర్యాటక శాఖ మరియు ఇతర ప్రభుత్వ శాఖలు కలిసి 3 కోట్ల రూపాయల పైనే ఖర్చు చేసాయి. దీనిలో 41 లక్షలు స్టేజి నిర్మాణానికి, 10 లక్షల రూపాయలు కేవలం ప్రచారానికే ఖర్చయింది. అనుత్పాదక మరియు దుబారా వ్యయాలు నియంత్రించాలని ఆదేశాలుండటంతో అధికారులు, ఈ ఖర్చును సమర్థించుకునే మార్గాలు అన్వేషిస్తున్నారు. 

బీచ్ ఫెస్టివల్  సమయంలో కలెక్టరేట్ క్యాంపస్ మరియు మంగినపూడి బీచ్ రహదారులలో 1075 మొక్కలు సిమెంటు కుండీలలో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ మొక్కలకు 7.75 లక్షలు ఖర్చు పెట్టినప్పటికీ, ఇప్పటికే వాటిలో చాలా వరకు నీరులేక ఎండిపోయాయి. 3.3 లక్షలు ఇంధనం కోసం, 9.5 లక్షలు లైటింగ్ కోసం, 3.5 లక్షల డిజిటల్ బ్రాడ్ కాస్టింగ్ కోసం ఖర్చు చేసారు. 

పర్యాటక శాఖకు ఈ ఫెస్టివల్ నిర్వహణ నిమిత్తం కోటి రూపాయలు మంజూరు కాగా, MUDA మరియు ఇతర ప్రభుత్వ శాఖలు ఈ ఈవెంట్ కోసం స్వతంత్రంగా ఖర్చు పెట్టినట్లు వైస్ చైర్మన్ పి.విల్సన్ బాబు తెలిపారు. కలెక్టర్  లక్ష్మీకాంతం నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ త్వరలో ఖర్చులను, వాదనలను పరిశీలించి,  బిల్లులను మంజూరు చేస్తుంది. అని ఆయన అన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post