సింగరేణి లాభంలో 207% వృద్ధి

సింగరేణి లాభంలో 207% వృద్ధి
ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL), 2017-18 ఆర్ధిక సంవత్సరానికి గాను  పన్నులకు కేటాయించిన తర్వాత లాభం ఏకంగా 207 శాతం పెరిగి ₹1,212 కోట్లకు చేరింది. గత సంవత్సరం ₹395 కోట్ల లాభాన్ని ఈ సంస్థ ఆర్జించింది. 

బుధవారం ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ అధ్యక్షతన జరిగిన కంపెనీ యొక్క 545 వ బోర్డు సమావేశంలో ఈ ఫలితాలను నిర్ధారించారు. యాజమాన్యం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతో సమావేశం అనంతరం కార్మికులకు, ఉద్యోగులకు  చెల్లించాల్సిన బోనస్ విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు.

సంస్థ యాజమాన్య బోర్డు కార్మికుల సంక్షేమం విషయంలో మరో ప్రధాన నిర్ణయం తీసుకుంది. కోల్ బెల్ట్ ప్రాంతంలో ఉండే అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవటానికి కార్మికులు మరియ ఉద్యోగులకు చెందిన అన్ని క్వార్టర్లలో ఎయిర్ కండీషనర్లను ఇంస్టాల్ చేయాలని నిర్ణయించింది. దీనికి సంస్థకు 60 కోట్ల రూపాయల వ్యయం అవనుంది. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సమావేశంలో మాట్లాడుతూ, సంస్థ మరియు కార్మికులు ఇలాగే అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post