అన్న క్యాన్టీన్లలో ఒక వ్యక్తికి భోజన ఖర్చు ₹55

అన్న క్యాన్టీన్లలో ఒక వ్యక్తికి భోజన ఖర్చు ₹55
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్న క్యాన్టీన్లలో ఒక వ్యక్తికి మూడు పూటలా భోజనం కోసం  55 రూపాయలు ఖర్చు చేస్తుంది. అక్షయ పాత్ర ఫౌండేషన్ వారి మంగళగిరిలోని  అధునాతన వంటశాల నుండి  విజయవాడ మరియు  మంగళగిరి లోని అన్న క్యాన్టీన్లకు  భోజన పదార్థాల సరఫరా చేస్తున్నారు. 

ప్రభుత్వం ఈ క్యాన్టీన్లకు స్థలాన్ని సమకూర్చటంతో పాటు, పురపాలక శాఖా నిధులతో వీటిని నిర్మించారు. సబ్సిడీ రేట్లలో వీటికి బియ్యాన్ని అందిస్తున్నారు.  గుంటూరు జిల్లాలో మిర్చి యార్డు ముందర ప్రారంభించిన క్యాన్టీన్ అక్కడ పనిచేసేవారికి, పట్టణ సందర్శకులకు ఏంతో ఉపయోగపడనుందని జిల్లా కలెక్టర్ శశిధర్ అన్నారు. అమరావతి రోడ్డు మరియు భవానీ పురం వద్ద ఆర్టీఏ కార్యాలయ రోడ్డులో కూడా అన్న క్యాన్టీన్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పథకంలో భాగంగా 100 అన్న క్యాన్టీన్లను ఇప్పటికే ప్రారంభించగా, మరో 100 క్యాన్టీన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. వీటిలో 5 రూపాయలకు ఒక పూట భోజనం అందించనున్నారు. ఉదయం పూట చట్నీ తో పాటు ఇడ్లీ /దోశ / పూరి /ఉప్మా/పొంగల్  అందించనుండగా, మద్యాహ్నం మరియు రాత్రి పూటలలో అన్నం, కూర, పప్పు, ఊరగాయ, సాంబార్ మరియు పెరుగులతో కూడిన భోజనాన్ని అందించనున్నారు. 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో కలిసి భవనపురం వద్ద ఒక క్యాంటీన్ ను  ప్రారంభించటం ద్వారా ఈ పథకం మొదలైంది.  ఆయన అక్కడే క్యాంటీన్ అధికారులు మరియు కార్మికులతో కలిసి భోజనం కూడా చేసారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post