పోలవరంపై ఇంకా అనుమానాలు

పోలవరంపై ఇంకా అనుమానాలు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వానికి  ఎటువంటి రాజకీయ అజెండా లేదని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనాలను భారీగా పెంచిన విషయంపై  తమకు అనుమానాలు ఉన్నాయని, రాష్ట్రం ఇంకా వివరణలు ఇవ్వవలసి ఉందని, ఇవి పరిష్కరిస్తే 2019 ఫిబ్రవరి నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని ఆయన తెలియజేసారు.

ప్రాజెక్టుపై కేంద్రానికి ఉన్న అనుమానాలు ఏమిటని అడిగిన ప్రశ్నను ఆయన దాటవేసారు. అవి సాంకేతికమైనవని, రెండు ప్రభుత్వాల మధ్య ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని ఆయన అన్నారు. 

నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, కేవలం సాంకేతిక సమస్యల కారణంగానే అనుమతుల్లో జాప్యం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర, కేంద్ర అధికారులు కలిసి మూడు రోజుల పాటు ప్రత్యేకంగా పోలవరం వ్యవహారాలపై సమావేశమవనున్నట్లు తెలియజేసారు. ఇప్పుడు సవరించిన ప్రాజెక్టు వ్యయం 57,940 కోట్లకు చేరింది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post