పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కు భారీ మద్ధతు

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కు భారీ మద్ధతు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు హోమ్ శాఖ నేతృత్వంలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా చేసిన వాగ్దానాలు ఏవీ నెరవేర్చలేదని విమర్శించారు. 

ఈ విమర్శలకు సమాధానంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరియు ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖల నుండి వచ్చిన ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 యొక్క నిబంధనలను తాము చాల వరకు అమలు చేసామని సమర్థించుకున్నారు.

స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ మాజీ హోం మంత్రి చిదంబరం మాట్లాడుతూ సభ్యుల ప్రశ్నలకు మంత్రిత్వ శాఖల సమాధానాలు పేలవంగా, అసంబద్ధంగా ఉన్నాయని దుయ్యబట్టారు. అసలు పబ్లిక్ డొమైన్లలో, వార్తా పత్రికలలోనే వీరు ఇచ్చే సమాధానం కన్నా ఎక్కువ సమాచారం లభ్యమవుతుంది. వీరి దగ్గర ఎటువంటి కొత్త వివరాలు లేవు అంటూ సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేసారు. తదుపరి సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులను కూడా పిలవాలని నిర్ణయించారు. 

సభ్యులు ఆంధ్ర ప్రదేశ్ పై పడుతున్న ఆర్థిక భారంపై కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ప్రగతి బాగుందని కేంద్ర ప్రతినిధులు చెప్పిన సమాధానం పై అసంతృప్తి వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు ఇంకా 1,600 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయవలసి ఉంది. డబ్బును విడుదల చేయకుండా, అది ఎలా పూర్తి అవుతుందని అనుకుంటున్నారు అని మరొక సభ్యుడు ప్రశ్నించారు. విభజన చట్టంలో ఉన్న 19 అంశాలపై అసలు చర్యలే చేపట్టలేదని సభ్యులు ఏకగ్రీవ అభిప్రాయానికి వచ్చారు. 

తెలుగు దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పార్లమెంట్లో తమ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేసారు. తెలుగుదేశం సభ్యుడు రామ్మోహన్ నాయుడు మాటాడుతూ మేము ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఇంకా పెండింగ్లోనే ఉంది. మాతో కలసి వచ్చే పార్టీలతో చర్చించి ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాం అని తెలియచేసారు. తమ డిమాండ్లు నెరవేరేవరకు పార్లమెంట్ లోపల బయట నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేసారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post