ఆంధ్రప్రదేశ్ లో బంద్ విజయవంతం

ఆంధ్రప్రదేశ్ లో బంద్ విజయవంతం
ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పిలుపునిచ్చిన బంద్ విజయవంతమైంది. ప్రభుత్వం వ్యూహాత్మకంగా కీలక ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించింది. వైసిపి నేతలను ముందస్తు అరెస్టులు చేసి నిరసనకారులతో కఠినంగా వ్యవహరించినప్పటికీ చాలా చోట్ల ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరించారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడవలేదు. ఉదయం విజయవాడలో పోలీసుల సహాయంతో కొన్ని బస్సులు తిప్పినప్పటికీ, మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలో డిపోలకే పరిమితమయ్యాయి. పాఠశాలలు, దుకాణాలు, బ్యాంకులు మూతపడ్డాయి. ప్రయివేటు పాఠశాలలు ముందస్తుగా సెలువు ప్రకటించారు. కొంతమంది తెరవగా భారీ స్థాయిలో ఆందోళనకారులు చుట్టుముట్టి మూసివేయటానికి ప్రయత్నించారు. 

విశాఖపట్నంలో బంద్ సందర్భంగా ఉద్రిక్తతలు చెలరేగాయి.  ఉదయం ఆర్టీసీ బస్సులు నడపడానికి ప్రయత్నించగా వైసిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసిన సందర్భంగా ఆందోళనలు జరిగాయి. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల స్వచ్చందంగా బంద్ పాటించగా, మరికొన్ని చోట్ల భారీ స్థాయిలో వైసిపి కార్యకర్తలు గుమిగూడి బంద్ నిర్వహించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post