మణిపూర్, మిజోరంలలో వరద భీభత్సం - Telugu News

Thursday, 14 June 2018

మణిపూర్, మిజోరంలలో వరద భీభత్సం

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మణిపూర్, మిజోరంలను వరదలు ముంచెత్తాయి. అక్కడక్కడా కొండ  చరియలు కూడా విరిగిపడుతున్నాయి. అస్సాంలో కూడా కొన్ని ప్రాంతాలు ఈ వర్షాలవల్ల ప్రభావితమయ్యాయి. 

ప్రధానంగా ఇంఫాల్ లోయ ప్రభావితమైంది.  దాదాపు 50% కి పైగా జనాభా ఇక్కడే కేంద్రీకృతమవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నదుల గట్లు తెగిపోవటం, రహదారులు కొట్టుకపోవటం, కొండ చరియలు విరిగి పడటం తో పరిస్థితి మరింత భీభత్సం గా మారింది. ఇక్కడి ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కూడా మునిగి పోవటంతో  సర్వీసులు నిలిపివేశారు. విమానాశ్రయాన్ని రాకపోకలకనుగుణంగా పునరుద్ధరించే పనులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం కార్యకలాపాలకు రెండు రోజులపాటు సెలవులు ప్రకటించింది .  

No comments:

Post a Comment