భారత్ కు పాక్, పాక్ కు హింద్

భారత్ కు పాక్, పాక్ కు హింద్
భారత్ కు పాక్, పాక్ కు హింద్ 
ఇది వినటానికి  కొంచం విచిత్రంగా, సామరస్య భావన లాగా అనిపిస్తుందా? అలాంటిదేమి కాదు. భారత్ రష్యాతో అత్యాధునికమైన ఐదవ తరం యుద్ధ విమానాన్ని సంయుక్తంగా అభివృద్ధి చేయటానికి ఒప్పందం కుదుర్చుకుంది. అభివృద్ధి దశలో ఉన్న ఈ T- 50 లను పాక్ FA లుగా పిలుస్తున్నారు. దీని పనితీరుపై సంతృప్తి చెందితే 100 కు పైగా విమానాలను కొనుగోలు చేయనుంది. 

పాకిస్తాన్  రష్యా నుండి Mi-35 హెలికాప్టర్ లను కొనటానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విమానాలకు హింద్ అనే ముద్దు పేరు ఉంది. ఈ హెలికాఫ్టర్లను ఎగిరే ట్యాంకులు గా అభివర్ణిస్తారు. ఇండియా కూడా ఈ హెలికాప్టర్లను 1980ల నుండి ఉపయోగిస్తుంది. ఈ మద్యకాలంలో వీటి స్థానాన్ని అమెరికాకు చెందిన అపాచే-64E హెలికాఫ్టర్ల తో భర్తీ చేసి, పాత వాటిని అఫ్ఘానిస్తాన్ కు ఉచితం గా అందచేయటం ప్రారంభించారు. ఈ విధంగా భారత్ కు పాక్, పాక్ కు హింద్ లు రానున్నాయి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post