రేపో రేటు ను తగ్గించిన ఆర్బీఐ

రేపో రేటు ను తగ్గించిన ఆర్బీఐ
రేపో రేటు ను తగ్గించిన ఆర్బీఐ
2016-17 సంవత్సరంలో జరిగిన తొలి పరపతి సమీక్షలో భాగంగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీనితో రేపో రేటు 6.5% శాతానికి చేరింది. క్యాష్ రిజర్వు రేషియో (4%) లో ఎలాంటి మార్పులు చేయలేదు.

రేపో రేటు అనేది బ్యాంకులు ప్రభుత్వం వద్ద తీసుకునే డబ్బులకు వసూలు చేసే వడ్డీ రేటు. ఒక బేసిస్ పాయింటు అనేది ఒక పర్సెంట్లో వందో వంతు. 25 బేసిస్ పాయింట్లు అంటే 0.25% ను సూచిస్తుంది. ఈ పరిణామంతో బ్యాంకులు వడ్డీ రేట్లు సవరించగలరని భావిస్తున్నారు.

దేశ జీడిపిలో ద్రవ్యలోటును 3.9 శాతానికి పరిమితం చేయటంలో భాగంగా ఆర్బీఐ ఈ చర్యను చేపట్టింది. ద్రవ్యోల్బణం కూడా తగ్గి 5 శాతానికి పరిమితమవగలదని బావిస్తున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post