అసోం సీఎం పై కేసు నమోదు

అసోం సీఎం పై కేసు నమోదు
అసోం సీఎం పై కేసు నమోదు
అసోం సీఎం తరుణ్‌ గొగోయ్‌పై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఎన్నికల సంఘం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్‌ రోజున మీడియా సమావేశం నిర్వహించినందుకు ఎన్నికల సంఘం ఈ ఫిర్యాదు చేసింది.

ఈ విషయాలపై డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్ సందీప్ సక్సేనా వివరణ ఇచ్చారు. ఎన్నికలు ముగియటానికి 48 గంటల ముందు నుండి ఎన్నికలు ముగిసే వరకు ఎటువంటి మీడియా సమావేశాలు నిర్వహించకూడదనే నిబంధన ను ఉల్లంఘినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై సమావేశానికి ముందే స్థానిక ఎన్నికల అధికారులు హెచ్చరించినా పెడచెవిన పెట్టి మరీ నిర్వహించారని తెలిపారు. 

ఈ సమావేశంలో తరుణ్‌ గొగోయ్‌ ఎన్నికల సంఘం పై తీవ్ర ఆరోపణలు చేసారు. స్థానిక ఎన్నికల అధికారులు పక్షపాతంతో బిజెపికి అనుకూలంగా వ్యవరిస్తున్నారని, ఒక అభ్యర్థిని, ఒక మాజీ మంత్రిని అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు. 

సందీప్ సక్సేనా ఈ నిర్భందం ఆరోపణలు నిజం కావని, అధికారులు కేవలం అభ్యర్థి ఇంటిని సోదా చేసారని వివరణ ఇచ్చారు. ఎన్నికల కమిషన్ నిజాలు నిర్ధారించుకున్న తర్వాతే తరుణ్‌ గొగోయ్‌ పై Section 126 of RP Act కింద FIR నమోదు చేసినట్లు వివరించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post