'సన్'రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్

'సన్'రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్
'సన్'రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ను సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఇండియా గా పేర్కొనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పేరుకు త్వరలోనే సార్థకత కల్పించబోతున్నారు. ఆయన గారి సన్ నారా లోకేష్ త్వరలో రాజకీయ అరంగ్రేటం చేయనున్నారు.

లోకేష్ ను తన వారసుడిగా ప్రకటించేందుకు చంద్రబాబు గత కొన్ని సంవత్సరాలుగా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పదవి అయిన జాతీయ కార్యదర్శి పదవిని అప్పగించి పార్టీని ఆయన చేతుల్లో పెట్టారు. ఇక ప్రభుత్వంలోకి తీసుకురావటమే మిగిలి ఉంది. దానికి అనుగుణంగానే లోకేష్ ను మంత్రి వర్గం లోకి తీసుకుంటారని తెలుస్తుంది.

దశాబ్దాల పాటు కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు చేస్తుందంటూ విమర్శిస్తూ వస్తున్న చంద్రబాబు, తను కూడా అదే వారసత్వ రాజకీయాలు చేయడం విశేషం. అసలు చంద్రబాబు నాయుడు కూడా వారసత్వం వల్లనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక వేళ ఎన్టీఆర్ కి అల్లుడు కాకపొతే ముఖ్యమంత్రి ఎలా అయ్యేవాడు అనే వాళ్ళు కూడా ఉన్నారు.

చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లాగా తాను అనుకున్న వెంటనే కుమారున్ని మంత్రిని చేసి విమర్శల్ని ఎదుర్కునే సాహసం లేదు. మరి ఏం చేస్తారు. ఆయనకు మొదట్నుంచి ఒక అలవాటు ఉంది. ఆయన ఏపనైనా చేయాలనుకుంటే ముందు మీడియాలో విస్తృతంగా వార్తలు వస్తాయి. ఆ తర్వాత పార్టీ నాయకుల నుండి డిమాండ్లు వస్తాయి. ఇవన్నీ జరిగిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులలోనే చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకుంటారన్నమాట.

ఎన్టీఆర్ ను అధికారం నుండి దింపేటప్పుడు కూడా సరిగ్గా ఇదే సిద్ధాంతం అమలైంది. పత్రికల్లో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిలకు వ్యతిరేకంగా వార్తలు, పార్టీలో అసంతృప్తి నాయకుల నుండి డిమాండ్లు, వైస్రాయ్ లో సమావేశం తర్వాత కథ తెలిసిందే. అలా విజయవంతమైన ఫార్ములా ను ఇప్పుడు కూడా లోకేష్ విషయం లో కూడా వాడుతున్నారు. ఒకవేళ 2019 తర్వాత ముఖ్య మంత్రి పదవి చేపట్టాల్సి వచ్చినా వరల్డ్ బ్యాంకు లో ఉద్యోగాన్ని వదులుకుని, సామాన్య కార్యకర్తగా పార్టీ లో చేరి, పార్టీకి సేవలందించి, మంత్రి గా అనుభవం సంపాదించి, ముఖ్య మంత్రి పదవికి స్వయంకృషి తో అర్హత సంపాదించుకున్నాడు. వారసత్వ ప్రమేయం లేదు అంటారన్నమాట. వీటిలో భాగంగా మీడియాలో వార్తలు రావటం, పార్టీ నాయకులు డిమాండ్ చేయడం జరిగిపోయాయి.

కేంద్ర మంత్రి వర్గంలోకి పంపించాలని మొదట ఆలోచన చేసినా, ఒకవేళ కేంద్రం నుండి అనుకున్న సహాయం అందకపోతే, కొడుకు మంత్రి పదవి కోసం రాజీ పడ్డాడు లాంటి విమర్శలు వస్తాయని వద్దనుకున్నారట .

0/Post a Comment/Comments

Previous Post Next Post