1
యాదాద్రి కల్యాణ వేడుక నుంచి అర్ధంతరంగా వెళ్ళిపోయిన గవర్నర్
యాదాద్రి కల్యాణ వేడుక నుంచి అర్ధంతరంగా వెళ్ళిపోయిన గవర్నర్
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ రాత్రి 8:30 గంటలకు వచ్చారు. ఎప్పుడూ భక్తిశ్రద్ధలతో, దైవ కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించే గవర్నర్  ఆలయ ఈవో గీతారెడ్డిని ఆలస్యం పై  ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరికొందరు ప్రజాప్రతినిధులు రావాల్సి ఉందనీ , అందుకే ఆలస్యమవుతోందని ఈవో బదులిచ్చినట్టు సమాచారం. చివరకు 10:45 వరకు వేచిచూసిన నరసింహన్ సతీసమేతంగా కళ్యాణ వేడుక నుంచి లేచి వెళ్లిపోయారు. గవర్నర్ వెళ్లిన తర్వాత మరో నలభై నిమిషాలకు అంటే 11: 25 నిమిషాలకు స్వామి వారి కళ్యాణ ఘట్టం పూర్తయింది.

Post a Comment


  1. మీరు భలే న్యూస్ లు పడతారు/పెడతారండీ :)

    జిలేబి

    ReplyDelete

 
Top