0
బంగ్లాదేశ్ కు భారత్ నుండి డీజిల్ ఎగుమతులు
బంగ్లాదేశ్ కు భారత్ నుండి డీజిల్ ఎగుమతులు
భారత్ నుండి బంగ్లాదేశ్ కు రైల్వే వాగన్ల ద్వారా డీజిల్ ఎగుమతులు ఇవాళ (మార్చ్ 17న ) ప్రారంభమయ్యాయి. 2200 టన్నుల (2700 కిలో లీటర్ల) తో మొదటి కన్సైన్మెంట్ సిలిగురి రిఫైనరీ నుండి బంగ్లాదేశ్ లోని ప్రతిభాపూర్ లోని బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ (BPC) డిపో కు బయలుదేరింది. ఈ డీజిల్ BS III (Euro-III) గ్రేడ్   350 PPM సల్ఫర్ నాణ్యత కు చెందినది. ఈ రైల్ 516 km (253 km ఇండియా లో  మరియు  263 km బంగ్లాదేశ్ లో)  ప్రయాణించి మార్చ్ 19న గమ్యస్థానం చేరుకోనుంది.

భారత్, బంగ్లాదేశ్ ల మద్య కుదిరిన ఒప్పందం లో భాగంగా  ప్రతిభాపూర్ నుండి సరిహద్దు వరకు పైప్ లైన్ నిర్మించనున్నారు. దీనిని సిలిగురి రిఫైనరీ కి చెందిన పైప్ లైన్ తో జత చేస్తారు. ఇది పూర్తయ్యేవరకు రైలు వాగన్ల ద్వారా డీజిల్  సరఫరా చేయనున్నారు.

Post a Comment

 
Top