తెలంగాణా ఐటి పార్కులకు డిమాండ్

తెలంగాణా ఐటి పార్కులకు డిమాండ్
తెలంగాణా ఐటి పార్కులకు డిమాండ్
గత ఆరు నెలలుగా తెలంగాణా ఐటి పార్కులలొ ఉన్న స్థలాలకి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.  మాదాపూర్‌లోని సైబర్‌టవర్స్, సెబర్‌పెరల్, సైబర్‌గేట్‌వే, రహేజా మైండ్‌స్పేస్, అసెండాస్, ఫీనిక్స్,  గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని వేవ్‌రాక్, క్యూసిటీ.. ఇలా ఏ ఐటీ సెజ్ లో ఇప్పుడు స్థలం కావాలన్నా కష్టమే. అన్నింట్లో 90% కి పైగా బుక్ అయిపోయాయి.

చెన్నై వరదల తర్వాత ఈ డిమాండ్ ఒక్కసారిగా పెరిగినట్టు చెబుతున్నారు. బెంగళూరు, పూణే లలో స్థలాల ధరలు అధికంగా ఉండటం అందరూ ఒక్కసారిగా హైదరాబాద్ పై దృష్టి సారించారు. పైగా తక్కువ వెతనాలకే  సుశిక్షితులైన ఉద్యోగులు దొరకటం, తక్కువ జీవన వ్యయం, తుఫాన్లు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం తక్కువగా ఉండటం హైదరాబాద్ కు అదనపు ఆకర్షణలవుతున్నాయి.

మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో కొత్త సెజ్ లను నిర్మించడానికి చాలామంది డెవలపర్లు పభుత్వానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. బహుళ జాతి రియల్ ఎస్టేట్ సంస్థ టిష్మన్ స్పియర్ ఒక్కటే 65 లక్షల చదరపు అడుగుల స్థలం నిర్మిస్తుండటం, దీనిలో ఆపిల్ తో సహా ఇతర సంస్థలు ఇప్పటికే బుక్ చేసుకోవటం విశేషం.

0/Post a Comment/Comments

Previous Post Next Post