0
మజ్లిస్ పై విరుచుకపడ్డ కేసిఆర్
మజ్లిస్ పై విరుచుకపడ్డ కేసిఆర్
మజ్లిస్ నేతలు ఏం చేసినా టిఆర్ఎస్ నాయకులు ఏమీ అనరు అని అంటుంటారు. అది కొంత వరకు వాస్తవమే. కానీ ఇవాళ మజ్లిస్ నేతలపై ముఖ్యంగా అక్బరుద్దీన్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ఏ విషయంపై చర్చించాలో చెప్పకుండా శాసనసభ కార్యకలాపాలు అడ్డుకోవడం సరికాదనీ, ప్రభుత్వం దళిత వ్యతిరేకి అన్న మాటలు వెనక్కి తీసుకోవాలని కూడా అన్నారు. తామెప్పుడూ అలా ప్రవర్తించకున్నా అలా ఆరోపించటం బాగాలేదని స్పష్టం చేశారు.

అన్ని విషయాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామనీ, అనవసరంగా నినాదాలు చేయడం వద్దనీ, పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నం చేయడం తప్పనీ కేసిఆర్ అన్నారు.

Post a Comment

 
Top