0
పోలీస్ గుర్రాలకు రక్షణ ఉపకరణాలు
పోలీస్ గుర్రాలకు రక్షణ ఉపకరణాలు
ఇటీవల ఉత్తరాఖండ్‌లో జరిగిన  శక్తిమాన్ ఉదంతం తర్వాత పోలీసులు ఆందోళనలను అణచి వేయటానికి గుర్రాలను ఉపయోగించటం పై జంతు ప్రేమికుల నుండి,  సామాజిక మాధ్యమాలలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దిద్దుబాటు చర్యల్లో భాగంగా,  ఇక ఇలాంటి ఘటనల్లో మరోసారి ఏ గుర్రానికి హాని కలుగకుండా ఉండేందుకు గుర్రాలకు రక్షణ ఉపకరణాలు (Protective Gear) ఏర్పాటు చేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రక్షణ ఉపకరణాల్లో గుర్రాల కళ్లకు అద్దాలు, కాళ్లకు కవచాలు ఏర్పాటు చేయనున్నారు.

రక్షణ ఉపకరణాల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయగానే మొదట 330 గుర్రాలకు ఈ ఏర్పాట్లు చేయనున్నారని డీజీపీ జావీద్ అహ్మద్ వెల్లడించారు. శిక్షణ లో ఉన్న గుర్రాలకు, క్రీడల్లో పాల్గొనే గుర్రాలకు ఈ ఏర్పాట్లు అవసరం లేదని స్పష్టం చేశారు.

Post a Comment

 
Top