ఏప్రిల్ 6 న సిద్ధిపేట ఎన్నికలు

ఏప్రిల్ 6 న సిద్ధిపేట ఎన్నికలు
ఏప్రిల్ 6 న సిద్ధిపేట ఎన్నికలు
సిద్ధిపేట ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి జారీ చేసారు. దీని ప్రకారం ఏప్రిల్ 6న ఎన్నికలు, ఏప్రిల్ 11న కౌంటింగ్ జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి వస్తుంది మరియు మున్సిపల్ పరిధి వరకే వర్తిస్తుంది.

ఈ నోటిఫికేషన్ వివరాలు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ అయిన రోనాల్డ్ రాస్ తెలియ చేసారు. ఆయన తెలిపిన వివరాలు
మార్చ్ 21 నుండి మార్చ్ 23 వరకు - నామినేషన్స్ స్వీకరణ
మార్చ్ 24 - నామినేషన్స్ పరిశీలన
మార్చ్ 25 - నామినేషన్స్ ఉపసంహరణ కు ఆఖరి తేది
- ఈ పోలింగ్ కోసం 34 వార్డులలో 84 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పోలింగ్ సెంటర్లలో 22 సెంటర్లను అత్యంత సమస్యాత్మకంగా,35 సెంటర్లను సమస్యాత్మకంగా పరిగణిస్తున్నారు.

సిద్ధిపేట చుట్టుపక్కల ఆరు గ్రామాల్లోని ప్రజలను మునిసిపాలిటీ లో కలపటానికి వ్యతిరేకంగా వేసిన పిటీషన్ ను హై కోర్ట్ కొట్టివేయటం తో ఎన్నికలకు మార్గం సుగమమైంది. ఈ గ్రామాలను కలపటం తో వార్డుల సంఖ్య 32 నుండి 34 కు పెరిగింది. సిద్ధిపేట, రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి కేంద్రం కావటం తో ఇక్కడ TRS సులభంగా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post