50 మైక్రాన్లకంటే తక్కువ మందంగల ప్లాస్టిక్ కవర్లపై నిషేధం

50 మైక్రాన్లకంటే తక్కువ మందంగల ప్లాస్టిక్ కవర్లపై నిషేధం
50 మైక్రాన్లకంటే తక్కువ మందంగల ప్లాస్టిక్ కవర్లపై నిషేధం
ప్లాస్టిక్ వ్యర్థపదార్థాల వినియోగంపై ఐదేండ్ల క్రితం (2011 లో) రూపొందించిన నియమాలను కేంద్రం  సవరించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం 50 మైక్రాన్లకంటే తక్కువ మందంగల ప్లాస్టిక్ కవర్లపై నిషేధం విధించింది. ఇప్పటివరకు 40 మైక్రాన్లకంటే తక్కువ మందంగల ప్లాస్టిక్ కవర్లపై ఈ నిషేధం ఉండేది.

కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల్లో ప్లాస్టిక్ కవర్లు  తయారు చేసే కంపెనీలు చెల్లించే పన్నులను రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసి వాటిని స్థానిక సంస్థలకు అందజేయాలని, ఆ నిధులతో స్థానిక సంస్థలు ప్లాస్టిక్‌ను సరైన పద్ధతిలో రీ సైకిల్  చేయాలని పేర్కొంది.  దేశంలో ప్రతి రోజూ 15వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉత్పన్నమవుతుండగా కేవలం 9వేల టన్నులను మాత్రమె సేకరించి రీ సైకిల్ చేస్తున్నారు.

ఇప్పుడు రూపొందించిన నియమాలు ప్లాస్టిక్ వాడేవారి బాధ్యతను పెంచే విధంగా ఉన్నాయి. ఎవరైనాసరే వినియోగించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మిగతా వ్యర్థాల నుండి  వేరుచేసి వాటిని రీ సైకిల్ విభాగానికి అందించి దానికి అయ్యే వ్యయం చెల్లించాలి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post