హైదరాబాద్ హౌస్

హైదరాబాద్ హౌస్
హైదరాబాద్ హౌస్
హైదరాబాద్ హౌస్ లో మోడీ ఒబామా మీటింగ్, హైదరాబాద్ హౌస్ లో మోడీ ఒబామా జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ - ఇవే నిన్నటి నుండి మీడియా లో షికారు చేస్తున్న వార్తలు. అసలు హైదరాబాద్ హౌస్ డిల్లీ లో ఎందుకు వుంది? అక్కడ వున్న ఈ హైదరాబాద్ హౌస్ గురించిన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్ హౌస్ నిజామ్ నవాబు డిల్లీ కి వచ్చినప్పుడు బస చేయటానికి కట్టిన ఖరీదైన భవనం. ఇది వైస్రాయ్ హౌస్ (ఇప్పటి రాష్ట్రపతి భవన్) నిర్మించిన ప్రముఖ బ్రిటీష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటేన్స్ చే డిజైన్ చేయబడింది. బాబుఖాన్ ప్రాపర్టీస్ వారు 1926 నుండి 1929 వరకు దీనిని నిర్మించారు. ఆ కాలం లో డిల్లీ లో వున్న అతి విశాలమైన ఖరీదైన భవనం ఇదే.

హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయ్యాక కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యం లోకి వెళ్ళింది. దీనికి ప్రతిగా కేంద్రం రాష్ట్రానికి ఇప్పుడు ఎపి భవన్ నిర్మించిన ప్రాంతం లో స్థలాన్ని ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిర్వహించే విందులు సమావేశాలు ఇందులో జరుగుతున్నాయి.

8.77 ఎకరాల విస్తీర్ణం లో నిర్మింపబడిన ఈ భవనం సీతాకోక చిలుక(butterfly) ఆకారం లో వుంటుంది. దీనిలో మొత్తం 36 రూములు వున్నాయి. యురోపియన్ల మరియు మొఘలుల మిశ్రమ నిర్మాణ శైలి దీనిలో కనిపిస్తుంది. ఈ భవనం డిల్లీ లోని ఇండియాగేట్ కు వాయువ్య దిశలో వుంటుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post