అబుదాబి సమావేశం - పాల్గొంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

అబుదాబి సమావేశం - పాల్గొంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
అబుదాబి సమావేశం - పాల్గొంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
దుబాయి లో నివసిస్తున్న ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం సెప్టెంబర్ 13 న అబుదాబి లో నిర్వహిస్తున్న ఒకరోజు సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో కలిపి  తొమ్మిది  రాష్ట్రాలు పాల్గొంటున్నాయి. నాలుగు విడతలు గా సాగే ఈ సమావేశం ఈ తరహా సమావేశాలలో మొదటిది కావటం విశేషం .

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ సమావేశంలో  ప్రవాస భారతీయ ప్రతినిధులు తొమ్మిది రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొంటారు. ఈ సమావేశం లో పాల్గొంటున్న తొమ్మిది రాష్ట్రాలు వరుసగా బీహార్, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గోవా, పంజాబ్, తెలంగాణ మరియు పశ్చిమ బెంగాల్. ఈ సమావేశం ప్రధాన ఎజెండా కలసి పనిచేద్దాం - సంక్షేమ లక్ష్యాలు సాధిద్దాం (Working together: Improving Service Delivery).

ఈ సమావేశం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవాస భారతీయుల కోసం అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలను నేరుగా ప్రవాస భారతీయ ప్రతినిధులతో వివరించటానికి ఉపయోగపడుతుంది. అలాగే తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రవాస భారతీయ ప్రతినిధులు కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకొని రావొచ్చు. వాటి ఆధారం గా తమ కార్యక్రమాల్ని సమీక్షించుకోవటానికి, అక్కడ పనిచేస్తున్న భారతీయుల ప్రమాణాల్ని మెరుగుపరచటానికి ప్రభుత్వాలకి ఉపయోగపడుతాయి
.

0/Post a Comment/Comments

Previous Post Next Post